Eesha Public Talk: హార్రర్ థ్రిల్లర్ ‘ఈషా’.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Eesha Public Talk: హార్రర్ థ్రిల్లర్ ‘ఈషా’.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌‌‌‌లో శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.  కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్‌‌‌‌, వంశీ నందిపాటి విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా గురువారం (2025 డిసెంబెర్ 5న) సినిమా విడుదలైంది.

ఈ క్రమంలో సినిమా చూసిన ఆడియన్స్..‘‘ఈషా గ్రేట్ థ్రిల్లింగ్ ఎక్సపీరియెన్స్ ఇస్తుందని’’ సోషల్ మీడియాలో రివ్యూలు షేర్ చేస్తున్నారు. ఫస్టాఫ్, సెకండాఫ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. హారర్ Bgmతో ఖచ్చితంగా భయపెట్టేలా చేస్తుందని, కొన్ని సీన్స్‌కి పక్కా బయపడుతారని ట్వీట్స్ పెడుతున్నారు. ఇది 2025లోనే ఖచ్చితంగా బెస్ట్ హారర్ సినిమా అవుతుందని చెబుతున్నారు. ఆత్మలు, మూఢ నమ్మకాలపై సాగిన సీన్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయని ఆడియన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు’’.

సాధారణంగా ప్రతి హారర్ థ్రిల్లర్ మూవీస్‌‌‌‌లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. కానీ, ఈ సినిమాలో ఆడియన్స్ ఒక రియలిస్టిక్ ఫీల్‌‌‌‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారని అనేలా మూవీ ఉందని ట్వీట్స్ పెట్టడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. అందులోనూ, ట్విస్ట్‌లతో కూడిన ఉత్కంఠభరితమైన సీన్స్ ఈ సినిమాలో ఉండటం మరింత ప్లస్ పాయింట్ అవ్వనుంది. అంతేకాకుండా క్రిస్పీ రన్‌టైమ్, భయపెట్టే నేపథ్య సంగీతం అడిషనల్ ప్లస్ పాయింట్స్గా నిలిచాయి.

‘ఈషా’ కథగా.. 

కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ అనే నలుగురు ఫ్రెండ్స్. దెయ్యాలు, ఆత్మలు లేవని వీరు బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలో వీరు ఓ  టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బట్టబయలు చేస్తుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు ఓ సమాచారం తెలుస్తుంది. ఎలాగైనా అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. అలా వీరు అనుకున్నట్టుగానే ఆ ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఇంతకీ ఆ బాబా విసిరిన సవాలు ఏంటి? దాన్ని వల్ల వారు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? చివరికి ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు? ఇంతకీ ఆదిదేవ్ అసలు క్యారెక్టర్ ఎలాంటిది? అనేదే తెలియాలంటే మూవీ థియేటర్లో చూడాల్సిందే!!

‘ఈషా’ ప్రీ రిలీజ్ ఈవెంట్:

ఈషా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. థియేటర్‌‌‌‌‌‌‌‌లో ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి చూస్తూ థ్రిల్‌‌‌‌ ఫీలవుతా. ఆ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’తో కూడా అలాంటి ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ అందరినీ వెంటాడుతుంది. ఈ మూవీ స్టోరీలో నావెల్టీతో పాటు మంచి ట్విస్టులు ఉన్నాయి. ఇందులో నటించిన అందరికీ విజయం వస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ఇది ప్రేక్షకుడిని భయపెట్టి, ఓ మీనింగ్‌‌‌‌ ఫుల్‌‌‌‌ మేసేజ్‌‌‌‌ ఇచ్చి.. ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్‌‌‌‌తో థియేటర్‌‌‌‌ నుంచి బయటికి తీసుకొస్తుంది’ అని చెప్పారు.

బన్నీ వాసు మాట్లాడుతూ ‘హారర్‌‌‌‌ సినిమా లవర్స్‌‌‌‌ బాగా ఎంజాయ్‌‌‌‌ చేస్తారు. క్లైమాక్స్‌‌‌‌ సీన్స్‌‌‌‌ అందర్ని షాకింగ్‌‌‌‌కు గురిచేస్తాయి. థియేటర్‌‌‌‌లో ఖచ్చితంగా అందరూ భయపడతారు’ అని చెప్పారు. అందరికి అందుబాటులో ఉండేలా ఈ సినిమాకు టిక్కెట్లు రేట్లు తగ్గించామని సమర్పకులు దామోదర ప్రసాద్ అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు త్రిగుణ్‌‌‌‌, అఖిల్, హెబ్బాపటేల్,  దర్శకుడు శ్రీనివాస్‌‌‌‌ మన్నె సహా టీమ్ అంతా పాల్గొన్నారు.