- కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా తురుకల మద్దికుంటకు చెందిన కోల రాజం ఇటీవల చనిపోయారు. మంత్రి మృతుడి కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.
ఈ సందర్బంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్సజ్జాద్, లీడర్లు గంగుల సంతోష్, బండారి సునీల్,తదితరులు ఉన్నారు.
లైబ్రరీ సంస్థ చైర్మన్‌కు పరామర్శ
సీనియర్ కాంగ్రెస్ లీడర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాజలింగు గౌడ్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఆయన కుటుంబాన్ని బుధవారం మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. రాజలింగు గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. గ్రామ ఉపసర్పంచ్‌గా, కాంగ్రెస్ వాదిగా రాజలింగు గౌడ్ నిబద్ధతతో పనిచేసేవారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు గాజుల రాజమల్లు, అబ్బయ్య గౌడ్, శ్రీగిరి శ్రీనివాస్, జి.జగన్, నీరటి శంకర్, కల్వల శ్రీనివాస్, ఏపీ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
