పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకోవటం కామన్.. ఫోన్ పట్టుకున్నప్పటి నుంచి గూగుల్ సెర్చ్ చేసి చూడటం వెరీ వెరీ కామన్. మనకు కావాల్సినవి ఏవో సెర్చ్ చేసుకుని వెళ్లిపోతాం.. నెంబర్ అంటూ ఎప్పుడూ టైప్ చేయం.. అంత అవసరం పెద్దగా ఎవరికీ రాదు.. గూగుల్ సెర్చ్ లో 67 అని టైట్ చేస్తే.. గూగుల్ షేక్ అవుతుంది.. అవును.. నిజం.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండీ.. ఎందుకిలా జరుగుతుంది.. 67 నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేయటానికి గూగుల్ పేజీ ఎందుకు షేక్ అవుతుందో తెలుసుకుందామా..
గూగుల్ జస్ట్ కావాల్సిన సమాచారాన్ని వెతికే సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు. తన వినియోగదారులను అలరించడానికి రకరకాల "ఈస్టర్ ఎగ్స్" పేరుతో సీక్రెట్ ఫీచర్లను కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ సెర్చ్ బార్‌లో "67" అనే నంబర్‌ను టైప్ చేయటం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక వైరల్ ట్రెండ్‌గా మారింది. యూజర్లు గూగుల్ సెర్చ్ బార్‌లో కేవలం "67" అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే.. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా వణికినట్లుగా ఊగిపోతుంది.
స్క్రీన్ ఒక్కసారిగా ఇలా కదలడం చూసి చాలా మంది వినియోగదారులు తమ ఫోన్ లేదా కంప్యూటర్ పాడైపోయిందని ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది గూగుల్ కావాలనే తీసుకొచ్చిన ఒక వినోదాత్మక ఫీచర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న "షేకింగ్ మీమ్" ట్రెండ్ ఆధారంగా గూగుల్ ఈ చిలిపి పనిని తీసుకొచ్చింది. ఈ ప్రభావం కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్ నార్మల్ అయిపోతుంది. ఒకవేళ స్క్రీన్ అలాగే ఊగుతుంటే.. పేజీని రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది అంతే.
దీంతో పాటు గూగుల్‌లో పాతదైనా ఇప్పటికీ అలరించే మరో ఫీచర్ "Do a Barrel Roll". మీరు గూగుల్‌లో ఈ పదాన్ని వెతికితే మీ స్క్రీన్ మొత్తం 360 డిగ్రీల కోణంలో ఒక్కసారిగా గిరగిరా తిరిగి మళ్లీ మామూలుగా సెటిల్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్‌తో గూగుల్ తన యూజర్లకు వినోదాన్ని పంచుతోంది. మీరు కూడా ఒకసారి మీ బ్రౌజర్‌లో "67" అని టైప్ చేసి స్క్రీన్ ఎలా ఊగుతుందో సరదాగా టెస్ట్ చేసేయండి.
