ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి :  కలెక్టర్ పమేలా సత్పతి
  •     కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతోపాటు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల వారీగా కాన్పులు తదితర వివరాలపై సమీక్షించారు. ప్రసవాలు, ఆరోగ్య మహిళ, ఎన్ఆర్సీ, ఆర్బీఎస్‌‌‌‌‌‌‌‌కే, 108సేవలు, ఆరోగ్యశ్రీ, ఐ, డెంటల్ ఎగ్జామినేషన్, లెప్రసీ సర్వే, టీబీ, ఇమ్యూనైజేషన్ క్యాలెండర్, బూస్టర్ డోస్, గర్భిణుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయడంపై చర్చించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ కనీసం 80 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలన్నారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సుధా, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలు చందునాయక్, రాజగోపాల్, ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.