తిరుమలకు భక్తుల తాకిడి.. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జాం..!

తిరుమలకు భక్తుల తాకిడి.. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జాం..!

తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.   తిరుపతి   అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. కౌస్తుభం గెస్ట్ హౌస్ లో చికెన్ బిరియాని, కోడి గుడ్లు బయటపడటంతో వాహనాల తనిఖీని మరింత పెంచారు. తనిఖీల విషయంలో  భద్రతా వైఫల్యాలు బయటపడుతున్న క్రమంలో సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో చెక్ పాయింట్ దగ్గర ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు భద్రతా సిబ్బంది.

 తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించడంపై  సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో నిషేధిత వస్తువులు తిరుమలకు వెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు సిబ్బంది.దీంతో టోల్ గేట్ నుండి అలిపిరి ఆర్చ్ వరకు భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.  భక్తులు  అసహనం వ్యక్తం చేస్తున్నారు . తనిఖీ సిబ్బందిని పెంచి వాహన తనిఖీలను వేగవంతంగా చేయాలని కోరుతున్నారు భక్తులు.