విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడం కోసం జనవరి 4న ఎగ్జామ్‌‌ థాన్

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడం కోసం జనవరి 4న  ఎగ్జామ్‌‌ థాన్

బషీర్​బాగ్​, వెలుగు: పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడం కోసం ఎగ్జామ్‌‌ థాన్ పేరుతో రన్ ను నిర్వహిస్తున్నట్లు కావేరి యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్​ ప్రవీణ్ రావు తెలిపారు. 

ఈ రన్ కు  సంబంధించిన లోగో, టీ-షర్ట్​, మెడల్‌‌ను బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జనవరి 4న గచ్చిబౌలిలో టీ హబ్ వద్ద 5కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.