ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్ : ఇరిగేషన్శాఖ

ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్ : ఇరిగేషన్శాఖ

హైదరాబాద్, వెలుగు: ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ఇరిగేషన్​శాఖ ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈఎన్సీలను భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రస్తుతం సూర్యాపేట సీఈగా పనిచేస్తున్న వెంకట రమేశ్ బాబును ఈఎన్సీ అడ్మిన్​గా ప్రమోట్​ చేశారు. అదేవిధంగా కామారెడ్డి సీఈగా ఉన్న తమతం శ్రీనివాస్​ను కామారెడ్డి ఈఎన్సీగా, నిజామాబాద్​ సీఈగా పనిచేస్తున్న మధుసూదన్​రావును నిజామాబాద్ ఈఎన్సీగా ప్రమోట్​చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.