హుస్నాబాద్ లోని ఆలయాల హుండీ ఆదాయం లెక్కింపు

హుస్నాబాద్ లోని ఆలయాల హుండీ ఆదాయం లెక్కింపు

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​లోని రేణుక ఎల్లమ్మ దేవాలయం, పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర దేవస్థానాల్లో బుధవారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ. 3,37,476 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావు వెల్లడించారు. శ్రీ స్వయంభూ రాజేశ్వర దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ. 8,12,132 ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 

ఈ లెక్కింపు ప్రక్రియకు సంగారెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి వెంకట రమణారెడ్డి పరిశీలకులుగా హాజరయ్యారు. ఆలయ మాజీ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ, ప్రధాన అర్చకుడు పరమేశ్వర్ పర్యవేక్షణలో పారదర్శకంగా లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కుమారస్వామి, హనుమంతు, రమేశ్, రాజయ్య, రాజు, సతీశ్,​తో  గోమాత సేవా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.