ఓల్డ్‌సిటీ వెలుగు : రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటపూల్ వద్ద ఇటీవల జరిగిన జునైద్ హత్య కేసుతో పాటు 40 క్రిమినల్ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్ జాఫర్ పహిల్వాన్ ఇంట్లో పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేశారు. అక్రమ ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే ప్రభాకర్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ నేతాజీ, మీర్ చౌక్ సీఐ సురేష్ కుమార్, భవాని నగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాలస్వామిలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సోదాల్లో కత్తులు, అనుమానిత ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మాజీ రౌడీ షీటర్ సయిద్ పహిల్వాన్, సులేమాన్ పహిల్వాన్ నిందితులపై ఆయుధాల చట్టం కింద రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కిరణ్ ఖరే ప్రభాకర్తెలిపారు. జునైద్ హత్య కేసులో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు గాలిస్తున్నారు పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
