
బాసర, వెలుగు: బాసర ట్రీపుల్‌ఐటీ కళాశాలకు ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్బ్రాడ్కాస్టింగ్కార్పొరేషన్(యూఎస్) అందించిన కంజూమర్రీసెర్చ్రిపోర్టు ఆధారంగా అవార్డు కేటాయించారని ఇన్చార్జ్ వీసీ అశోక్‌కుమార్ చెప్పారు. 13వేల మంది గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతిక విద్య అందించడం, అత్యున్నత స్థాయి వసతులు, ఇంటర్నేషనల్ లెవల్ ప్రయోగశాలలు నెలకొల్పడం, వర్సిటీలో 68శాతం విద్యార్థినులకు సాంకేతిక విద్య అందించడం తదితరార అంశాలను అవార్డు కేటాయింపులో పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. 11న ఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు చెప్పారు.