ఒక్కేసి పువ్వేసి చందమామ.. నగరంలో జోరుగా సాగుతున్న బతుకమ్మ వేడుకలు

ఒక్కేసి పువ్వేసి చందమామ.. నగరంలో జోరుగా సాగుతున్న బతుకమ్మ వేడుకలు

వెలుగు నెట్ వర్క్: బతుకమ్మ వేడుకలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఐదో రోజు గురువారం అట్ల బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, కాలనీల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. రాశి కలుపుదాం రావె చందమామ’ అంటూ పాటలతో హోరెత్తించారు.