
వెలుగు, సిటీ నెట్వర్క్: సిటీలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తిశ్రద్ధలు, తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. బతుకమ్మ ఆటపాటలతో పట్నం గల్లీగల్లీ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. సరూర్నగర్ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 63.11 అడుగుల భారీ బతుకమ్మ గిన్నిస్ రికార్డులను కొల్లగొట్టింది.