అంతర్జాతీయ స్థాయిలో ఆడబిడ్డల పండుగ..సెప్టెంబర్ 29న సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందితో బతుకమ్మ వేడుకలు

అంతర్జాతీయ స్థాయిలో ఆడబిడ్డల పండుగ..సెప్టెంబర్ 29న సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందితో బతుకమ్మ వేడుకలు
  •     63 అడుగుల ఎత్తైన బతుకమ్మ ఏర్పాటు చేస్తం
  •     గిన్నిస్ రికార్డు లక్ష్యంగా నిర్వహణ: మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి

హైదరాబాద్, వెలుగు:  ఈ నెల 29న గిన్నిస్ వ‌‌‌‌ర‌‌‌‌ల్డ్ రికార్డ్ లక్ష్యంగా స‌‌‌‌రూర్ న‌‌‌‌గ‌‌‌‌ర్ స్టేడియంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలను విజ‌‌‌‌యవంతం చేయాల‌‌‌‌ని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాల‌‌‌‌ని మంత్రులు కొండా సురేఖ‌‌‌‌, సీత‌‌‌‌క్క, జూప‌‌‌‌ల్లి కృష్ణారావు అధికారుల‌‌‌‌ను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడబిడ్డల పండుగ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

గురువారం సెక్రటేరియెట్​లో అధికారుల‌‌‌‌తో మంత్రులు స‌‌‌‌మీక్ష నిర్వహించారు. మహిళలకు సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. స‌‌‌‌రూర్ న‌‌‌‌గ‌‌‌‌రం స్టేడియంలో ఈ నెల 29న 10వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు,  63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నిస్‌‌‌‌ బుక్‌‌‌‌ రికార్డుల్లో చేర్చేలా ఏర్పాట్లు చేయాల‌‌‌‌ని సూచించారు. 

స్వయం స‌‌‌‌హాయ‌‌‌‌క సంఘాల‌‌‌‌ మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌ను త‌‌‌‌ర‌‌‌‌లించే బాధ్యత‌‌‌‌ను సెర్ప్ అధికారులు తీసుకోవాల‌‌‌‌ని, మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు హైద‌‌‌‌రాబాద్, రంగారెడ్డి, యాదాద్రి క‌‌‌‌లెక్టర్లు స‌‌‌‌మ‌‌‌‌న్వయం చేసుకోవాల‌‌‌‌ని సూచించారు. జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌‌‌‌బండ్​లో నిమజ్జనం చేయాలన్నారు.

 బతుకమ్మ విశిష్టత తెలిసేలా హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలు, ప్రధాన జంక్షన్లలో వివిధ ఆకృతులు, విద్యుత్ దీపాల‌‌‌‌తో అలంకరించాలన్నారు. ప‌‌‌‌ర్యాట‌‌‌‌క‌‌‌‌, సాంస్కృతిక‌‌‌‌,  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్, ట్రాన్స్‌‌‌‌కో, ఇత‌‌‌‌ర శాఖ‌‌‌‌లు స‌‌‌‌మ‌‌‌‌న్వయంతో ప‌‌‌‌ని చేయాల‌‌‌‌ని సూచించారు. ఈ నెల 27న ట్యాంక్ బండ్ పై బతుక‌‌‌‌మ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 30న ట్యాంక్ బండ్ పై స‌‌‌‌ద్దుల బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ కార్యక్రమాలు ఉంటాయ‌‌‌‌న్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.