అప్పుల్లో ఉందని ఆర్టీసీని, రాష్ట్రాన్నీఅమ్ముతావా?

అప్పుల్లో ఉందని ఆర్టీసీని, రాష్ట్రాన్నీఅమ్ముతావా?

సమ్మె అనేది కార్మికుల హక్కు అని అన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. అప్పుల్లో ఉందని ఆర్టీసీ ఆస్తులను అమ్ముతాను అంటున్న కేసీఆర్.. రాష్ట్రం అప్పుల్లో ఉందని  రాష్ట్రాన్ని అమ్ముతారా? అని అన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యాంగా మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ మాటల్లో ఫ్యూడల్ విధానం కనిపించిందన్నారు.  ఒక్క హుజుర్ నగర్ విజయంతో సీఎం మితిమీరిన మాటలు మాట్లాడారని అన్నారు.

కార్మికులు కడుపుఖాళీ సమ్మెకు వెళ్తే పనికిమాలిన సమ్మె అంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నిజస్వరూపం నిన్నటితో బయటపడిందన్నారు. ఆర్టీసీని కేసీఆర్ సృష్టించింది కాదని..దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న సంపద అని అన్నారు.  టీఆర్ ఎస్ ప్రభుత్వం.. ఇకనైనా అప్పులు, తాకట్టు పెట్టడం ఆపాలన్నారు.  న్యాయస్థానాలు అంటే సీఎంకి లెక్కలేదా? అని ప్రశ్నించారు. సీఎం కోర్టులనైనా గౌరవించి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలన్నారు.