ఢిల్లీ పార్లమెంట్ వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతాపార్టీ పిలుపునిచ్చిన క్రమంలో.. నిరసనకారుల ఆందోళనలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో నిరసనలు పార్లమెంట్ గేటును తాకాయి. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు పోలీసులు. పలువురు నిరసన కారులకు గాయాలయ్యాయి.
భారీ ఎత్తున పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న విద్యార్థులను, నిరసన కారులను ఆపేందుకుు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ భద్రతా సిబ్బందిపార్లమెంట్ గేట్లకు తాళాలు వేశారు.
బారికేడ్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నిరసన కారులు బారికేడ్స్ ను, గేట్లను తోసేసి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. భాష్ప వాయు గోళాలు తగిలి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరో వైపు దూసుకొస్తున్న నిరసన కారులను ఆపేందుకు పార్లమెంట్ భద్ర సిబ్బంది టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో సిద్ధంగా ఉన్నారు
పోలీసుల లాఠీ ఛార్జ్ తో సీజేపీ సపోర్టర్స్ భారీ ఎత్తున రైల్ భవన్ ముందు భారీ గ్యాదర్ అయ్యారు. పార్లమెంటుకు నిమిషాల దూరంలో రైల్ భవన్ ఉండటంతో ఏ క్షణంలో పార్లమెంట్ వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
