V6 News

జాతీయ జనగణనలో బీసీ కాలమ్ ఉండాల్సిందే : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

జాతీయ జనగణనలో బీసీ కాలమ్ ఉండాల్సిందే :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  •     ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్​
  •     బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: జాతీయ జనగణనలో బీసీ కాలమ్ ఉండాల్సిందేనని, బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వివరాలను సేకరిస్తున్నట్టే, బీసీల కోసం ప్రత్యేకంగా కాలమ్ కేటాయించాలని డిమాండ్​చేశారు. జాతీయ కులగణన ఫారంలో 34వ కాలమ్‌‌ను చేర్చి, అందులో బీసీల వివరాలను నమోదు చేయాలని సూచించారు. దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందో తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 

జనాభాను లెక్కిస్తేనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని, దానికి అనుగుణంగానే సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రోల్ మోడల్‌‌గా నిలిచిందని కొనియాడారు. ఇంటింటికీ వస్తున్న ఎన్యూమరేటర్లకు ప్రతిఒక్కరూ సహకరించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.