రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ .కృష్ణయ్య

రిజర్వేషన్లు  రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి..సీఎం రేవంత్  రెడ్డికి ఆర్ .కృష్ణయ్య

ఉప్పల్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని, పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోబోమని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య అన్నారు. రామంతపూర్ లో బీసీ నాయకులు, స్టూడెంట్స్​తో కలిసి ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు. 50 శాతం సీలింగ్ అనేది ఏ కోర్టు, ఏ రాజ్యాంగంలో పొందుపరచలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేశ్, రాజ్ కుమార్  పాల్గొన్నారు. 

సీఎంకు లెటర్​..

ముషీరాబాద్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రిజర్వేషన్ల ఖరారు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నారు.