- బీసీ నేత జాజుల శ్రీనివాస్
బషీర్‌బాగ్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తగ్గించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను నట్టేట ముంచాయని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి కుట్రల ఫలితంగానే 60 శాతం ఉన్న బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు దక్కాయని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని జీర్ణించుకోలేకే బీసీ శ్రేణులు గాంధీభవన్‌ను ముట్టడించాయని.. శుక్రవారం బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా బీసీ జేఏసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తామన్నారు.
