- బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. ఫీజులు చెల్లించేందుకు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ డెలివరీ బాయ్స్ గా పని చేస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేండ్లుగా పెండింగ్ ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఉద్యమిస్తుంటే సర్కారు వైపు నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఓవైపు కళాశాలల యాజమాన్యాల వేధింపులు, మరోవైపు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ర్యాంకు నిబంధన ఎత్తివేసి మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలన్నారు.
