ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి :  బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ 

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి :  బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఆ తర్వాతే  కౌన్సెలింగ్‌‌‌‌లు నిర్వహించాలని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌‌‌‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ అమలుపై స్పష్టమైన హామీ లేకుండానే పలు కోర్సులకు కౌన్సిలింగ్‌‌‌‌లు చేపట్టడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.

గత నాలుగేండ్లుగా  బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు నిధులను కాలేజీల ఖాతాలకు కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేలా తీసుకొచ్చిన జీవో నంబర్–7ను హైకోర్టు నిలిపివేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పాత విధానంపై స్పష్టత ఇవ్వకుండా అడ్మిషన్  కౌన్సెలింగ్‌‌‌‌ తేదీలు ప్రకటించడం సరైంది కాదన్నారు.