V6 News

బీసీల పోరాటానికి అండగా నిలవండి : తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు

బీసీల పోరాటానికి అండగా నిలవండి : తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు
  •     కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: బీసీల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి అండగా నిలవాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్, ఏపీ అధ్యక్షుడు శంకర్ రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు  ప్రొఫెసర్ భవన్ రావు తైవాడి ఆయనను బెంగళూరులోని నివాసానికి వెళ్లి కలిశారు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కర్నాటక ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించడం లేదన్నారు. 

బీసీ మహిళలకు సబ్ కోటా, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, బీసీ కుటుంబాల లెక్కింపుపై కర్నాటక అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. వచ్చే ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభకు చీఫ్​ గెస్ట్​గా హాజరు కావాలని ఆయనను ఆహ్వానించామని పేర్కొన్నారు. నాయకులు సచిన్  రాజోల్కర్, కుర్ర లక్ష్మణ్ యాదవ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, జనగాం రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.