ప్రొఫెసర్ మనోహర్ను విధుల్లోకి తీసుకోవాలి : జాజుల

ప్రొఫెసర్ మనోహర్ను విధుల్లోకి తీసుకోవాలి : జాజుల
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఓయూ ప్రొఫెసర్ మనోహర్ ను అకారణంగా సస్పెండ్ చేయడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం  చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కెరీర్ అడ్వాన్స్​మెంట్ స్కీమ్(క్యాష్) అమలులో ప్రమోషన్ పొందని యూనివర్సిటీ లెక్చరర్ల తరఫున ఓయూ టీచర్స్ అసోసియేషన్(ఔటా) 50 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతోందని పేర్కొన్నారు. వారికి  నాయకత్వం వహిస్తున్న మనోహర్ ను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు.

టీచర్ల సమస్యలను వైస్ చాన్స్​లర్, రిజిస్టార్ల దృష్టికి తీసుకుపోతే తప్పేంటని  ప్రశ్నించారు. ఓయూలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, దీనికి ఆజ్యం పోసేలా యూనివర్సిటీ రిజిస్టార్ నరేశ్​రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రొఫెసర్ మనోహర్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జాజుల హెచ్చరించారు.