పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకం : పొన్నం ప్రభాకర్ 

పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకం : పొన్నం ప్రభాకర్ 

ముషీరాబాద్, వెలుగు : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దళిత బహుజన విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవ సభను శుక్రవారం తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో  కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ చిక్కడపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామి గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి  హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. పాపన్న సాహసానికి మారుపేరని ప్రశంసించారు. అంతకుముందు నారాయణగూడ నుంచి చిక్కడపల్లి వరకు జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఓపెన్ టాప్ జీప్ లో పొన్నం ప్రభాకర్ పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, వెంకటేష్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ఎంవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.