వికెట్ తీసి వైభవ్ మీదకు దూసుకెళ్లిన కైల్ జమీసన్...ఢిల్లీ పేసర్ కు బిగ్ షాక్...

వికెట్ తీసి వైభవ్ మీదకు దూసుకెళ్లిన కైల్ జమీసన్...ఢిల్లీ పేసర్ కు బిగ్ షాక్...

రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం ( మే 1 ) హోరాహోరీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు వరుస ఓటముల తర్వాత ఈ మ్యాచ్ లో గెలుపొంది విజయపథంలోకి అడుగుపెట్టింది ఢిల్లీ. రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ.ఇదిలా ఉండగా...ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైల్ జమీసన్ ఈ మ్యాచ్ లో చేసిన ఓవర్ యాక్షన్ కు భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ. వైభవ్ సూర్యవంశీపై దూకుడు ప్రదర్శించి విమర్శలపాలయ్యాడు జమీసన్. జమీసన్ కు డీమెరిట్ పాయింట్ తో పాటు బిగ్ వార్నింగ్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్యం. 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే చోటుచేసుకుంది ఈ ఘటన. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన ఆనందంలో సంయవనం కోల్పోయిన జమీసన్...వైభవ్ దగ్గరికి వెళ్లి అగ్రెసివ్ గా ప్రవర్తించాడు. ఒక టీనేజ్ ప్లేయర్ పై ఆ రేంజ్ లో స్లెడ్జింగ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కుకుండా ఈ వ్యవహారం బీసీసీఐ దగ్గరికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

జమీసన్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం... జమీసన్ ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చింది. ఈ క్రమంలో మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను జమీసన్ అంగీకరించడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ తో పాటు బిగ్ వార్నింగ్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్యం.లెవల్ 1 నిబంధనల ఉల్లంఘన కింద జమీసన్ పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఐపీఎల్ యాజమాన్యం.