మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: మక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టర్​ రాహుల్​శర్మ, అడిషనల్​ కలెక్టర్​అశోక్​కుమార్​తో కలిసి ఆఫీసర్లతో కొనుగోళ్లపై సమీక్ష చేపట్టారు. 

జిల్లాలో సుమారు 49175 హెక్టార్లలో మక్కజొన్న సాగు చేయగా, ఇప్పటివరకు 3274 క్వింటాళ్ల మక్కజొన్న కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన మక్కజొన్నను నిల్వ చేసేందుకు జిన్నింగ్ మిల్లులు తదితర గోదాంల సామర్థ్యంపై పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.