ములుగు, వెలుగు: ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, చిన్నారులను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు బాల భరోసా ద్వారా ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు ప్రభుత్వాస్పత్రిలో బాలల పరిరక్షణ విభాగం, పోషణ్ అభియాన్, ఆర్ బీఎస్కే విభాగాలు సంయుక్తంగా డీడబ్ల్యూవో ప్రేమలత అధ్యక్షతన బాల భరోసా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆరేళ్ల లోపు చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక అభివృద్ధి లోపాలను గుర్తించేందుకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీడబ్ల్యూవో ప్రేమలత మాట్లాడుతూ 640 అంగన్వాడీ కేంద్రాల్లోని 17,375మంది పిల్లలకు 42రకాల ప్రశ్నలతో సర్వే చేపట్టామని, అందులో అవసరమున్న 6779మంది పిల్లలకు స్క్రీనింగ్ చేయగా 65మంది చిన్నారులకు హైరిస్క్ గా గుర్తించినట్లు తెలిపారు
