ధర్మసాగర్, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల, ఎలుకుర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అడిషనల్కలెక్టర్ రవి కలిసి తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని సాయిపేటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కూలీలను సన్మానించారు.
