ఉజ్వల భవిష్యత్తు కోసమే బాల భరోసా : కలెక్టర్ అంకిత్

ఉజ్వల భవిష్యత్తు కోసమే బాల భరోసా : కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ చండ్రుగొండ, వెలుగు: చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం బాల భరోసా ప్రోగ్రాంను నిర్వహిస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెం నగరంలోని మాత, శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ప్రోగ్రాంలో నెలలోపు జన్మించిన ఆడపిల్లలకు బీటీ జన్మోత్సవ్​ కిట్లలను కలెక్టర్​ పంపిణీ చేశారు. హాస్పటల్​లో చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. 99 రోజుల ప్రణాళికలో బాల భరోసా ప్రోగ్రాంను ప్రభుత్వం చేపట్టిందన్నారు. అనంతరం చండ్రుగొండ మండలం దామచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్​ పరిశీలించి, పలు సూచనలు చేశారు.