జెర్సీ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ రేట్లను పెంచిన బీసీసీఐ

జెర్సీ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌  రేట్లను పెంచిన బీసీసీఐ


న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్‌‌‌‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ రేట్లను బీసీసీఐ పెంచింది. ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌లో ఒక్కో మ్యాచ్‌‌‌‌కు రూ. 3.5 కోట్లుగా నిర్ణయించింది. మెగా ఈవెంట్లలో మ్యాచ్‌‌‌‌కు రూ. 1.5 కోట్లుగా ఖరారు చేసింది. ఐసీసీ, ఆసియా క్రికెట్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ (ఏసీసీ)కు సంబంధించిన టోర్నీల్లో ఆడే మ్యాచ్‌‌‌‌లకు ఈ రేట్లు వర్తించనున్నాయి. గతంలో ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు రూ. 3.17 కోట్లు ఉండగా, ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌‌ వంటి  టోర్నీల్లో మ్యాచ్‌‌‌‌లకు రూ. 1.12 కోట్లుగా ఉండేది. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ చట్టం అమల్లోకి రావడంతో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ నుంచి డ్రీమ్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో కొత్తగా వచ్చే స్పాన్సర్ల కోసం ఈ రేట్లను నిర్ణయించారు. ఈ మార్పులతో బీసీసీఐకి రూ. 400 కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే బిడ్డింగ్‌‌‌‌ ఫలితాన్ని బట్టి ఇది ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. డ్రీమ్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ తప్పుకోవడంతో ఎలాంటి స్పాన్సర్‌‌‌‌ లేకుండానే ఆసియా కప్‌‌‌‌లో ఆడనున్న టీమిండియా.. టోర్నీ  తర్వాత కొత్త స్పాన్సర్‌‌‌‌ను ఖరారు చేయనుంది. ఇప్పటికే కొత్త స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ కోసం బిడ్డింగ్‌‌‌‌లను
 కూడా ఆహ్వానించింది.