బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలె : ఎమ్మెల్సీ కవిత

బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలె :  ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధ న ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంద ని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఉండా ల్సిందేనన్నారు. బీసీ కులగణన చేపట్టా లని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించి అందులోనూ ఓబీసీ మహిళల కు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్​లోని దతియాలో ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా లేరు కనుకే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లను ఇవ్వడం లేదనిన్నారు.