- రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించలేదు: దాసు సురేశ్
హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల కేటాయింపులో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ను అనుసరించలేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ఆరోపించారు. అందుకే రాష్ట్రంలోని 27 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ పోస్టూ దక్కకుండా పోయిందని తెలిపారు.
ఇది బీసీ సమాజానికి తీరని అన్యాయమని, ఈ లోపాన్ని వెంటనే సరిదిద్దకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని ఆవేదనవ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను, బీసీలకు మాత్రం డేడికేషన్ కమిటీ సర్వేను పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్పారు. ప్రతి మండలంలోనూ బీసీ కోటా ప్రకారం సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేయాలన్నారు.
