V6 News

‘సర్’ పట్ల అప్రమత్తంగా ఉండండి..దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి..

‘సర్’ పట్ల అప్రమత్తంగా ఉండండి..దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి..

 

  •     తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: ఓటరు జాబితా సవరణలో భాగంగా మే 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సర్) ఇంటింటి సర్వే పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్​పల్లిలోని క్యాంప్ ఆఫీస్​లో సనత్​నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. 

ఈ సర్వేపై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు ఉన్నందున, అధికారులు వివరాలు సేకరించే సమయంలో ఏజెంట్లు సమన్వయం చేసుకోవాలని కోరారు. ప్రతి బూత్​కు స్థానిక ఓటర్లపై అవగాహన ఉన్న ఒక ఏజెంట్​ను నియమించాలని, అలాగే 18 ఏళ్లు నిండిన వారందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులను హెచ్చరించారు.