27 రోజుల్లో.. 3 కోట్ల బీర్లు తాగారు.. మంచినీళ్ల కంటే బీర్లే ఎక్కువ..!

27 రోజుల్లో.. 3 కోట్ల బీర్లు తాగారు.. మంచినీళ్ల కంటే బీర్లే ఎక్కువ..!

తెలంగాణలో ఎన్నికల పుణ్యాన లిక్కర్  సేల్స్ వీపరితంగా పెరిగాయి.  రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడయ్యాయి.  ఎన్నికల వేళ బీర్లను విపరీతంగా తాగారు పబ్లిక్.  2023 నవంబర్  నెలలో 27  రోజులకు 21 లక్షల 69 వేల కేసుల  లిక్కర్ సేల్స్ అమ్మడుపోయాయి.  అంతేకాకుండా  30 లక్షల 44 వేల కేసుల బీర్లు అమ్మకాలు సాగాయి. అంటే రోజుకు దాదాపుగా రోజుకు లక్ష బీర్ల కేసులు  అమ్ముడు పోయ అన్నమాట. దాదాపుగా మూడు కోట్ల విలువైన బీర్లను తాగారని లెక్కలు చెబుతున్నాయి.  

నవంబర్ 1 నుంచి  నవంబర్ 20 మధ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.  గత ఏడాది ఇదే టైమ్ లో  దాదాపు 12 లక్షల కేసులు బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో మూడు నెలల్లో దాదాపు రూ.8,900  కోట్ల విలువైన లిక్కర్​ అమ్ముడుపోయింది.  

రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. ఎండాకాలంలో బాగా పెరగటం సహజం.ఈ ఏడాది  ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల్లో రూ.9,032 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ సేల్స్ జరిగాయి.