నేను మంత్రి పదవి ఆశిస్తున్నా... బీర్ల ఐలయ్య

నేను మంత్రి పదవి ఆశిస్తున్నా... బీర్ల ఐలయ్య
  • గొల్ల కుర్మల ప్రతినిధిగా చాన్స్ ఇవ్వాలి

హైదరాబాద్: తాను మంత్రి పదవిని ఆశిస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను సీఎంను అడిగానని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. గొల్లకుర్మలకు మంత్రిపదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కూడా కలిశామని అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రిపదవులున్నాయని, భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ఒక్కరికీ లేదని అన్నారు. భువనగిరి సెగ్మెంట్  పరిధిలో తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు చెప్పారు.

ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదని ఐలయ్య గుర్తు చేశారు. గొల్ల కుర్మల ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించాలని అన్నారు.  ఏపీలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. 50 లక్షల పై చిలుకు జనాభా వున్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరొచ్చినా చేర్చుకుంటామని చెప్పారు. తనకు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని, మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.