బెల్లకొండ గణేష్ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’

బెల్లకొండ గణేష్ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’

‘స్వాతిముత్యం’ తర్వాత బెల్లకొండ గణేష్ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక హీరోయిన్‌‌‌‌. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. నిన్న ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన  వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. గణేష్ కూడా బాగున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా  సూపర్ హిట్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్‌‌‌‌గా నటించిన అవంతిక కూడా వాళ్ల అమ్మలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సతీష్ వర్మ, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. గణేష్ మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా రిలీజ్‌కి ముందే నన్ను నమ్మి ఈ  చాన్స్ ఇచ్చిన సతీష్‌‌‌‌ వర్మకి థ్యాంక్స్. రాకేష్‌‌‌‌కి సినిమా తప్ప వేరే  ఆలోచన ఉండదు. అవంతికను చూస్తే తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది. స్టూడెంట్స్‌‌‌‌తో పాటు అందరికీ నచ్చుతుంది’ అన్నాడు. 

‘ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మను  సౌత్ ఇండస్ట్రీ ఎంతగానో ఆదరించింది. నన్ను కూడా స్వాగతిస్తారని కోరుకుంటున్నా’ అంది అవంతిక. రాకేష్  మాట్లాడుతూ ‘గణేష్ ఎప్పుడూ కథలోనే ఉంటాడు. అవంతిక అంకితభావంతో పనిచేసే నటి. ఈ సినిమా బాగా వచ్చిందని చెప్పడానికి కారణం మా నిర్మాత సతీష్ గారు. ఆయన లాంటి నిర్మాత దొరకడం చాలా అదృష్టం’ అన్నాడు.  టీజర్ ఎంత ఇంటరెస్టింగ్‌గా అనిపించిందో సినిమా కూడా ఇంతే ఆసక్తికరంగా ఉంటుందన్నారు సతీష్ వర్మ. లిరిసిస్టులు కృష్ణ చైతన్య, కళ్యాణ్ చక్రవర్తి, నటులు శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్ ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్నారు.