IND vs ENG 2025: టీమిండియా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ విల విల.. కెప్టెన్‌తో పాటు ఇద్దరికి గాయాలు

IND vs ENG 2025: టీమిండియా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ విల విల.. కెప్టెన్‌తో పాటు ఇద్దరికి గాయాలు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ మ్యాచ్ పై పట్టు బిగించారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ భయంకరమైన బంతులతో భయపెట్టిన మన జట్టు 154 పరుగులకే సగం జట్టును పెవిలియన్ కు చేర్చారు. మరో 100 లోపు ఇంగ్లాండ్ మిగతా ఐదు వికెట్లను తెస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించవచ్చు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు చేయకపోగా.. గాయాలపాలవుతున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో పాటు ఓపెనర్ క్రాలీ, స్పిన్నర్ బషీర్ గాయపడ్డారు. 

మూడో రోజు బుమ్రా వేసిన ఒక ఓవర్ ఆడే ప్రయత్నంలో క్రాలీ చేతి వేలికి గాయమైంది. దీంతో బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు . నాలుగో రోజు ఆట ప్రారంభంలో బుమ్రా వేసిన బంతులకు మరోసారి ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ చేతికి గాయమైంది. బుమ్రా బౌలింగ్ ఆడలేక బ్యాట్ సైతం కింద పడేశాడు. నాలుగో రోజు రెండో సెషన్ లో సిరాజ్ వేసిన బంతిని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఆడడంలో విఫలమయ్యాడు. పుల్ షాట్ ఆడాలని చూస్తే బంతి కాస్త స్టోక్స్ గజ్జల్లో తగిలింది. దీంతో స్టోక్స్ అక్కడే పడిపోయాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో పలుమార్లు ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ టీమిండియా బౌలర్ల ధాటికి శరీరానికి బంతులు తగిలాయి. 

మూడో రోజు బషీర్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయం అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో బషీర్ వేసిన బంతిని జడేజా బలంగా బాదాడు. బంతిని ఆపే క్రమంలో బషీర్ చేతికి బలంగా తగిలింది. దీంతో బౌలింగ్ చేయలేక ఓవర్ మధ్యలోనే బషీర్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన ఓవర్ రూట్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టోక్స్ (24), వోక్స్ (1) ఉన్నారు.