చలో సెక్రటేరియట్‌‌పై బెంగాల్​ సీఎం మమత ఫైర్​

చలో సెక్రటేరియట్‌‌పై బెంగాల్​ సీఎం మమత ఫైర్​

కోల్​కతా : తమ ప్రభుత్వానికి వ్యతిరే కంగా బీజేపీ నేతలు మంగళవారం నిర్వహించిన చలో సెక్రటేరియట్​పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నిరసన ర్యాలీకి ఆ పార్టీ నేతలు వేరే రాష్ట్రాల నుంచి రౌడీలను తెప్పించార ని, వారికి బాంబులు, గన్స్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు హింసకు పాల్పడినా, పోలీసులపై దాడిచేసినా పోలీసులు లాఠీచార్జ్​ చేయలేదనిచెప్పారు. ‘‘బీజేపీ ర్యాలీ సందర్భంగాచాలామంది పోలీసులు గాయపడ్డారు. పోలీసుల పై దాడిచేసిన వారిని, ప్రభుత్వ వెహికల్స్​ను తగులబెట్టిన వారిని చట్టం వదలదు. ప్రశాంతంగా నిరసన తెలియజేస్తే ఇబ్బంది లేదు. కానీ రౌడీయిజం చేస్తామంటే సహించం” అని మమత హెచ్చరించారు.