ప్రైవేటు అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాలా..? ఈసీకి బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం మమత లేఖ

ప్రైవేటు అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాలా..? ఈసీకి బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం మమత లేఖ

 

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: ప్రైవేటు రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనపై బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు డేటా ఎంట్రీ ఆపరేటర్లను, బంగ్లా సహాయతా సిబ్బందిని ఎన్నికల డ్యూటీలకు నియమించొద్దంటూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఇచ్చిన ఆదేశంపైనా మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు నిర్ణయాలపై వెంటనే జోక్యం చేసుకోవాలంటూ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమె సోమవారం లేఖ రాశారు.

వెయ్యి మంది డేటా ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్లను ఏడాదిపాటు పనిచేసేలా నియమించేందుకు బయట ఏజెన్సీకి బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల సంఘం ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. దీనిపై మమత మండిపడ్డారు. అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సమర్థులైన ఉద్యోగులుండగా, బయటివారిని తీస్కోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఏ పార్టీ ఒత్తిడితో, ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం పనిచేస్తోందని క్వశ్చన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.