- బెంగాల్‌లో అన్నపూర్ణ యోజన ప్రారంభం..
- మహిళలకు నెలకు రూ.3 వేలు అందజేత
కోల్‌కత్తా: బెంగాల్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర మహిళల కోసం ‘అన్నపూర్ణ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద తొలి దశలో ఎంపికైన 28.25 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ పథకం కూడా ఉంది.
గత టీఎంసీ ప్రభుత్వం అమలు చేసిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం స్థానంలో ఈ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు. గత పథకం ద్వారా సుమారు 2.42 కోట్ల మంది మహిళలు నెలకు రూ.1,500 పొందుతుండగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని నూతన ప్రభుత్వం రూ.3,000కు పెంచింది.
ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. గత మూడ్రోజులుగా 28.25 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకూ ఈ లబ్ధి చేకూరేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
