రమ్య రఘుపతికి కోర్టు డబుల్ షాక్.. ఆమె వల్లే పాబ్లమ్స్

రమ్య రఘుపతికి కోర్టు డబుల్ షాక్.. ఆమె వల్లే పాబ్లమ్స్

ప్రముఖ నటుడు నరేష్ VK(Naresh VK) మాజీ భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) మళ్ళీ పెళ్లి(Malli Pelli) సినిమాను థియేటర్లు అండ్ OTTలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని బెంగుళూరు సివిల్ కోర్టు(Banglore civil court)కు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుండి వాయిదాల మీద వాయిదాలు  పడుతూ వచ్చిన ఈ కేసుకి తీర్పు ఇచ్చింది కోర్టు. ఈకేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన పిటీషన్ ను మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ ఆగస్టు 1న తీర్పును వెలువరించింది. 

మట్టే మదువే సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి దాఖలు చేసిన కారణాలు న్యాయస్థానం సమర్థించేలా లేవని,  వాటికి న్యాయపరమైన నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇచ్చినట్లుగా ఈ సినిమాలో చూపించిన కంటెంట్ పూర్తిగా కల్పితమని, ఆ విషయాన్ని సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసిన తర్వాత ఆ సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది. అంతేకాదు  మళ్ళీ పెళ్లి సినిమాను అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చు అని కూడా కోర్టు తెలిపింది.

అలాగే మరో కేసులో రమ్య రఘుపతిపై నరేష్ వేసిన పిటీషన్ ను కోర్టు స్వీకరించింది. నానక్‌రామ్‌గూడలో ఉన్న తన ఇంట్లోకి రమ్య రఘుపతికి ప్రవేశం నిషేధిస్తూ నరేష్ ఈ పిటీషన్ వేశారు. మరోవైపు రమ్య రఘుపతి కూడా నరేష్ పై గృహ హింస కేసు వేసింది. ఈ రెండు కేసులను క్షున్నంగా పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతిని రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నరేష్ ఇంకా అతని కుటుంబ సభ్యులు అందించిన సాక్ష్యాల మేరకు.. రమ్య రఘుపతి అక్కడ నివాసం లేదని, ప్రాపర్టీని తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని, రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వలన నరేష్, అతని ఫ్యామిలీకి అసౌకర్యంతో పాటు అందోళనకు కలుగుతుందని కూడా కోర్టు పేర్కొంది.