కారు చెడిపోతే.. హైవేపై ఆపడమే అతనిపాలిట శాపమైంది..ట్రక్కు ఢీకొని రియాల్టీ షో డ్యాన్సర్ మృతి

కారు చెడిపోతే.. హైవేపై ఆపడమే అతనిపాలిట శాపమైంది..ట్రక్కు ఢీకొని రియాల్టీ షో డ్యాన్సర్ మృతి

కొన్ని కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.. కొత్త కారు కొన్న సంతోషంలో ఉండగానే అంతలోనే విషాదం..ప్రయాణంలో ఉన్న కారు చెడిపోవడం.. రోడ్డుపక్కన ఆపడం..ఇంతలో అనుకోని ఘటన..వేగంగా వచ్చిన ట్రక్కు అతని పాలిటి యమపాశమైంది. చూస్తుండగానే గాల్లో బంతిలో లేచి కిందపడ్డాడు.. పడ్డోడు మళ్లీ లేవలె.. బెంగళూరు రూరల్​ నేలమంగళ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రియాల్టీ షో డ్యాన్సర్​ ఇంట విషాదం.. 

బెంగళూరు సమీపంలోని  నేలమంగళలో మంగళవారం(నవంబర్​5) ఉదయం జరిగినరోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్​ప్రాణాలు కోల్పోయాడు. కారుచెడిపోతే పక్కన ఆపి చెక్​ చేస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ట్రక్  ఢీకొట్టడంతో బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల డ్యాన్సర్​ సుధీంద్ర మృతిచెందాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ సోషల్  మీడియాలో వైరల్​ అవుతోంది. 

ఇటీవల కారును కొనుగోలు చేశారు మృతుడు సురేంద్ర.. తన సోదరుడిని కలిసేందుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. చెడిపోయిన కారును చెక్​ చేస్తుండగా వెనకనుంచి వచ్చిన ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో  సురేంద్ర స్పాట్​ లోనే చనిపోయాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సురేంద్ర చాలా రియాల్టీ షోలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.