బెంగళూరు: కర్నాటకలో కరడుగట్టిన ఖైదీలకు రాచమర్యాదలు చేస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రేపిస్టులు, క్రిమినల్స్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరడుగట్టిన నేరస్తుడు ఉమేశ్ రెడ్డి 1996 నుంచి 2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. వారిలో 18 మందిని చంపేశాడు. అతనికి మొదట ఉరిశిక్ష విధించగా, దాన్ని 2022లో 30 ఏండ్ల జైలు శిక్షగా సుప్రీంకోర్టు మార్చింది.
అప్పటి నుంచి బెంగళూరు సెంట్రల్ జైలులో ఉమేశ్ రెడ్డి ఖైదీగా ఉన్నాడు. అయితే అతను జైల్లో రెండు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఒక కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడు. అలాగే అతని బ్యారక్‌లో టీవీ కూడా ఉంది. మరోవైపు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తరుణ్ రాజ్ ఇదే జైల్లో ఉన్నాడు. అతడు కూడా సెల్‌ఫోన్ వాడుతున్నాడు.
తన బ్యారక్‌లోనే వంట కూడా చేసుకుంటున్నాడు. ఈ వీడియోలు బయటకు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై విచారణ జరిపించి, తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు.
