2 BHK ప్లాటా లేక ప్యాలెస్సా.. రూ.30 లక్షల డిపాజిట్.. 20 వేలు అద్దె అంట..!

2 BHK ప్లాటా లేక ప్యాలెస్సా.. రూ.30 లక్షల డిపాజిట్.. 20 వేలు అద్దె అంట..!

బెంగళూరులో ఇంటి ఓనర్స్ చాలా తెలివైన వాళ్లు. అద్దె కొద్దిగా తగ్గిస్తారు కానీ డిపాజిట్ల రూపంలో ఆస్తులు అడుగుతారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటది. అదే చివరికి ఇచ్చిన డిపాజిట్ మెుత్తం తిరిగి అద్దెదారుల చేతికి రాదు. రంగులు వేయించాలి, క్లీనింగ్ చేయించాలి, డ్యామేజీ కవరేజీలు, లిఫ్ట్ రిపేర్ ఛార్జీలు అంటే ఏవేవో లెక్కలు చెప్పి చివరికి డిపాజిట్ మెుత్తంలో కత్తింపులు వేస్తారు. పైగా అంట్లో అద్దెకు ఉన్న వాళ్లు ఇచ్చే డిపాజిట్ భారీ మెుత్తానికి వడ్డీని తిప్పుకోవటం లేదా పెట్టుబడులుగా పెట్టి అదనపు ఆదాయం సంపాదిస్తుంటారు చాలా మంది ఓనర్స్. ఇదే డబుల్ బెనిఫిట్ అంటే.

బెంగళూరు రెంట్ మార్కెట్ గురించి తాజాగా ఒక రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక ఓనర్ తన 2 BHK రూ.20వేల అద్దెకు ఆఫర్ చేస్తూ లిస్టింగ్ చేశాడు. అయితే నగరంలోని ఫ్లేజర్ టవర్  ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రూ.30 లక్షలు డిమాండ్ చేయటంతో టూలెట్ చూసిన వాళ్లకు కళ్లు తిరుగుతున్నాయ్. చాలా మంది అసలు అది ఇల్లా లేకపోతే ప్యాలెస్సా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కొత్త ఇల్లు అయితే మాత్రం డిపాజిట్ రూ.30 లక్షలు ఏంటి సామీ అంటూ ఆశ్చర్యపోతున్నారు బెంగళూరులోని జనాలు. 

ఈ ఇంటి గురించి ఓనర్ డిజైనరీ ఇంటీరియర్స్, ప్రీమియం బెడ్స్, మాడ్యూలార్ కిచెన్, వంట సామాగ్రి, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ, కార్ పార్కింగ్ ఉన్నాయంటూ పోస్టులో వెల్లడించారు. దీనిని చూసిన ఒక యూజర్ బెంగళూరు ఇంటి ఓనర్లు పెద్ద మోసగాళ్లు అంటూ కామెంట్ చేశారు. ఇదే సమయంలో చాలా మంది బెంగళూరులో రోజురోజుకూ పెరిగిపోతున్న ఇంటి అద్దెల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ గా ఉండేవాళ్లు ఇంటిని అద్దెకు తీసుకోవటం కంటే పీజీ హాస్టల్ లో ఉండటం మేలు అని మరికొందరు సూచిస్తున్నారు. మరొకరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు అద్దెకే దొరకటం లేదని ఒక వేళ ఉన్నా ఆకాశాన్ని అంటే రేట్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.