V6 News

పెళ్లి విందులో చోరీ.. కోటి రూపాయల నగలు కొట్టేశారు..బెంగళూరులో వెలుగు చూసిన ఘటన

పెళ్లి విందులో చోరీ.. కోటి రూపాయల నగలు కొట్టేశారు..బెంగళూరులో వెలుగు చూసిన ఘటన

బెంగళూరులో షాకింగ్ ఘటన.. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. గదిలో ఆభరణాలు మాయమయ్యాయి.. అలా గది బయట కాలు పెట్టిందో లేదో ఇలా తమ పని కానించేశారు మాటువేసిన మాయగాళ్లు..కేవలం మూడు గంటల వ్యవధిలో కోటి విలువైన ఆభరణాలు కొట్టేశారు కేటుగాళ్లు.. పెళ్లి విందుకు వెళ్లిన బాధితురాలు తిరిగి గదికి వచ్చే చూసి షాక్ కు గురైంది. పెళ్లి ఫంక్షన్ లో ఎన్నారై డాక్టర్ కు చెందిన కోటి విలువైన నగలు చోరీకి గురైన షాకింగ్ ఘటన బెంగళూరులోని అవలహళ్లిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..    

పెళ్లి విందులో కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన బెంగళూరులోని అవలహళ్లి ఎస్ డీపీ ప్యాలెస్ లో జరిగింది. అమెరికానుంచి వచ్చిన ఓ వైద్యురాలికి చెందిన 725 గ్రాముల గోల్డ్ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. పెళ్లి జరగుతున్న ఫంక్షన్ హాల్ లోని ఓ గదిలో ఉంచిన  ఝుమ్కాలు, వడ్డాణం సహా అభరణాలు మాయమైనట్లు బాధితురాలు అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు 52 ఏళ్ల డాక్టర్ సిరువెల్ల శ్రీదేవి అమెరికాలో స్థిరపడిన డాక్టర్. ఆమె తన అక్క కొడుకు పెళ్లికి హాజరయ్యేందుకు ఏప్రిల్ 18న భారత్ కు వచ్చారు. ఏప్రల్ 22న బీధరహళల్లలోని ఎస్ డీపీ ప్యాలెస్ లో జరిగిన వివాహవేడుకలకు హాజరయ్యారు. పెళ్లి విందు సమయంలో ప్యాలెస్ గదిలో ఉంచిన కోటి రూపాయల విలులైన ఝుమ్కాలు, వడ్డాణంతో సహా తన బంగారు నగలు పోయాయని అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

ఫంక్షన్ లో తాను కేవలం 12 గంటలు ఉన్నట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఏప్రిల్ 22 ఉదయం 11.30గంటలకు ఫంక్షన్ హాల్ కు వచ్చానని,  పెళ్లికి హాజరై రాత్రి 7 గంటల సమయంలో పెళ్లి విందుకు వెళ్లినట్లు తెలిపారు. పెళ్లి విందుకు కొన్ని నగలు ధరించగా మరికొన్ని గదిలో పెట్టి తాళం వేసి బయటికి వెళ్లినట్లు చెప్పారు. రాత్రి 11.30 గంటలకు గది వచ్చి చూస్తే నగలు మాయమైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు శ్రీదేవి.

ALSO READ | భార్య డైటీషియన్.. చంపేసి చెక్క బాక్సులో దాచేసి.. సిమెంటుతో కప్పెట్టేశాడు .. ఎలా దొరికాడంటే..

గదికి వేసిన తాళం వేసినట్లే ఉండడం.. నగలు మాయవడంపై పెద్ద మిస్టరీగా మారింది. మిస్టరీ ఛేదించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. గది తాళం చెవి బాధితురాలు శ్రీదేవి దగ్గర ఉన్నందున ఆమెకు , ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు గదిని శుభ్రం చేసేందుకు వ్చిన వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.