బెంగళూరులోని ఊబర్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది..క్యాబ్ డ్రైవర్లకు తక్కువ కమిషన్ ఇస్తున్నారంటూ నిరసనలు తెలిపారు. వందలాది మంది డ్రైవర్లు ఉబర్ ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆఫీసు తాళాలు పగలగొట్టి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
స్థానిక డ్రైవర్లను ఉబర్ యాప్‌లో బ్లాక్ చేస్తున్నారని..బంగ్లాదేశ్ ,ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు - ప్రాధాన్యత ఇస్తున్నారని, - రైడ్ అసైన్‌మెంట్లను కొందరికే ఇస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. భారత్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఉబర్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (KSRP) ప్లాటూన్ కూడా సంఘటన స్థలంలో మోహరించింది.
ఉబర్ ఫ్లీట్ డ్రైవర్లకంటే ఇండిపెండెంట్ డ్రైవర్లకు తక్కువ కమిషన్ ఇస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిని డ్రైవర్లు రిక్రూట్ చేసుకుంటున్నారని దీంతో స్థానిక డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉబర్ సంస్థ యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వందలాది మంది క్యాబ్ డ్రైవర్లు ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో ఆగ్రహించి డోర్లు పగలగొట్టి ఆఫీసులోకి ప్రవేశించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఉబర్ ఆఫసు దగ్గర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ వివాదంపై స్పందించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆరోపణలను ఖండించింది. డ్రైవర్లపై ఉబర్ ఎప్పుడూ వివక్ష చూపలేదని, ఈ ప్లాట్ ఫాం అందరిని సమానంగా చూస్తుందని తెలిపింది. కొంత మంది ఉబర్ ఆఫీసు వెలువల విధ్వంసం , హింస ను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలిపింది. నామమాత్రపు సబ్‌స్క్రిప్షన్ ఫీజు తో డ్రైవర్లు జీరో-కమిషన్ మోడల్‌పై పనిచేస్తున్నామని ఉబర్ తెలిపింది.
క్యాబ్ డ్రైవర్లు విధ్వంసం సృష్టించి ఆఫీసులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
