అడిలైడ్లో కోహ్లీకి మెరుగైన రికార్డు

అడిలైడ్లో కోహ్లీకి మెరుగైన రికార్డు

టీ20 వరల్డ్ కప్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో ఆడబోతుంది. సెమీస్ బెర్తుకు మరింత దగ్గరవ్వాలంటే భారత జట్టు ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచేందుకు రోహిత్ సేన అన్ని విధాలుగా సన్నదమవుతోంది. 

అందరి దృష్టి కోహ్లీపైనే..
ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉండనున్నాయి. దీనికి కారణం ఈమ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగడమే. ఈ పిచ్పై కోహ్లీ రికార్డు మెరుగ్గా ఉంది. అడిలైడ్లో కోహ్లీ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లు కలిపి 9 మ్యాచులు ఆడాడు. మొత్తం 13 ఇన్సింగ్స్లలో 84.30 సగటుతో పరుగులు చేశాడు. 843 రన్స్ కొట్టాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 141 పరుగులు. ఇక అడిలైడ్లో కోహ్లీ ఒక టీ20 మ్యాచ్ ఆడగా..ఇందులో 90 పరుగులు చేయడం విశేషం. 

36 పరుగులతో చెత్త రికార్డు..
అడిలైడ్లో చెత్త రికార్డు  టీమిండియా పేరిట ఉంది. ఈ పిచ్పై భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్తో జరిగిన టెస్టులో కోహ్లీ విఫలమయ్యాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల వద్ద కోహ్లీ రనౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రస్తుతం  కోహ్లీ భీకర ఫామ్‌లో ఉండటంతో...అడిలైడ్‌లో మరోసారి చెలరేగుతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.