కూల్​డ్రింక్​తో  జర జాగ్రత్త!

కూల్​డ్రింక్​తో  జర జాగ్రత్త!

కూల్​డ్రింక్​ తాగడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్​ దెబ్బ తింటోంది అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్​. ఎందుకంటే.. కూల్​డ్రింక్​ను షుగర్​తో తయారుచేస్తారు. మామూలుగానే షుగర్​ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. షుగర్​ నిండిన కూల్​డ్రింక్​ తాగడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడలేదు. దీనివల్ల చాలా హెల్త్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. హార్ట్, ఇమ్యూనిటి సిస్టమ్​ల మీద ఎఫెక్ట్​ పడుతుంది. మరీ ముఖ్యంగా కూల్​డ్రింక్​ అనేది  ఇమ్యూనిటి సిస్టమ్​ మీద ఎఫెక్ట్​ చూపిస్తుంది. ఒక 350 మిల్లీ లీటర్ల కూల్​డ్రింక్​లో దాదాపు 39 గ్రాముల షుగర్​ ఉంటుంది. ఇది చాలా రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్​ వంటి వాటికి గొడౌన్​లా ఉంటుంది. షుగర్​ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియా, వైరస్​లు పెరుగుతాయి. పైగా అవి ఈజీగా వ్యాపించ డానికి హెల్ప్​ చేస్తుంది. 

ఇన్ఫెక్షన్​ను పెంచుతుంది
ఇన్ఫెక్షన్​ అయిన కణాల మీద పోరాడి వైట్​ బ్లడ్​ సెల్స్​ వాటిని చంపేస్తాయి. అందుకే వీటిని కిల్లర్​ సెల్స్​ అని కూడా పిలుస్తారు. కానీ కూల్​డ్రింక్​లో ఉన్న షుగర్​ వల్ల వైట్​ బ్లడ్​ సెల్స్​ తగ్గి, లేనిపోని అనారోగ్య సమస్యలొస్తాయి. టైప్​ 2 డయాబెటిస్​ ఉన్నవాళ్లకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిస్​ రిస్క్​ ఎక్కువ
రెగ్యులర్​గా కూల్​డ్రింక్​ తాగితే టైప్ 2 డయాబెటిస్ పెరిగే ఛాన్స్​ ఉంది. షుగర్​ ఎక్కువగా తీసుకుంటుంటే ఇన్సులిన్​ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. దానివల్ల టైప్ 2 డయాబెటిస్​ ఉన్నవాళ్లకు చాలా ప్రమాదం. 

బాడీలో మంట
కూల్​డ్రింక్​ తాగితే బాడీలో మంట పుడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎక్కువ కాలం వేధించే రోగాలు ఏవైనా ఉంటే వాటి తీవ్రత కూడా పెంచుతుందని కొన్ని స్టడీస్​లో తేలింది. రెగ్యులర్​గా కూల్​డ్రింక్​ తాగేవాళ్లలో యూరిక్​ యాసిడ్​ స్థాయి పెరిగి, శరీరంలో మంట కలిగేలా చేస్తుంది.

బరువు పెరుగుతారు
రెగ్యులర్​గా కూల్​డ్రింక్​ తాగే వాళ్లు బరువు కూడా పెరుగుతుంటారు. ఎక్కువ బరువు ఉండడం వల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.