భోపాల్: శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు భగవద్గీత పారాయణ సెషన్‌లు నిర్వహించాలని మధ్యప్రదేశ్ పోలీసు శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఇది వారు నీతిమంతమైన జీవితం గడపడానికి మార్గనిర్దేశం చేస్తుందని, వారి జీవితాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని శిక్షణ కేంద్రాలలో దీనిని అమలు చేయాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ) రాజా బాబు సింగ్ శుక్రవారం శిక్షణ కేంద్రాల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్రాష్ట్రంలోని 8 పోలీసు శిక్షణ కేంద్రాల్లో 4 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు జులై నుంచి 9 నెలల ట్రెయినింగ్ పొందుతున్నారు.
