బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ!
రీసెంట్గా ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే.. తనదైన గ్లామర్‌తో టాలీవుడ్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా మరో క్రేజీ చాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. నాని హీరోగా, సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్గా భాగ్యశ్రీని సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అక్టోబర్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నారట. కీలక సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే న్యూస్ కూడా వినిపిస్తోంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఓజీ’ తర్వాత సుజీత్ రూపొందించనున్న చిత్రం కావడంతో అనౌన్స్మెంట్ నుంచే దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని చర్చలో దశలో ఉన్నాయి.
