
తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ సినిమా సక్సెస్ సాధించాలని చిరంజీవి బెస్ట్ విషెస్ చెప్పారు. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్, టైటిల్ ఆసక్తికరంగా ఉన్నాయి. తండ్రీ కొడుకు మధ్య ఎమోషన్‌తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. నా అభిమాని హీరోగా నటించే సినిమా బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటా. కొత్త దర్శకులు రావడం వల్ల ఇండస్ట్రీ కొత్త కంటెంట్‌తో ముందుకెళుతుంది.
టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ’ అన్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ‘డ్రగ్స్ కేసులో నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులోనూ ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతుంటారు. ‘‘ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న”అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రలు పోషించారు.